కన్నులు ఎరుపు రంగులోకి మారితే?...


 

కన్నులు ఎరుపు రంగులోకి మారితే?.. మనల్ని వేరే వారు చూస్తే దానిని మనం కన్నెర్ర చేసి చూస్తున్నారని అంటారు కానీ కొన్నిసార్లు కన్ను ఏ కారణం లేకుండానే ఎర్రగా మారిపోతుంది.  ఇలా  ఎర్రగా మారినప్పుడు మాత్రం కచ్చితంగా చికిత్స పొందడం అవసరమవుతుంది.  ఉదయం పూట నిద్రలేవగానే మనకు లేక కుటుంబంలో ఎవరో ఒకరితో లేక పిల్లలకు కళ్ళు ఎర్రగా మారి ఉంటాయి. కొన్నిసార్లు ఇలా ఎర్రగా మారిన కంటి నుండి నీరు కారణం లేదా చాలా అసాధారణ రీతిలో వూసూలు రావడం మనం గమనిస్తూ ఉంటాం.  ఒక్కొక్కసారి కన్నులు నొప్పిగా ఉండే అవకాశం కూడా ఉంది . మనం కంగారు పడ్డ తర్వాత దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ నుంచి మనకు తోచిన చుక్కల మందును తెచ్చి వేసుకుంటాం.  ఇలా కన్నులు ఎర్రగా మారడానికి అనేకమైన ఇన్ఫెక్షన్స్  కారణం అవుతాయి.  ఇలాంటి వేళలో మనకు తోచిన మందులు వాడడం వల్ల కంటిచూపు కోల్పోయే అవకాశం ఉంది.  కన్నులు ఎర్రగా మారడం  తో పాటు నొప్పి కూడా ఉంటే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందాలి అన్న కారణంతో అనేక నొప్పి మందులు వాడుతాం.  వీటివలన ఇతర వైరస్లు కూడా కన్ను ఎర్రగా మారడానికి ముఖ్య కారణం అవుతాయి.  ఇటువంటి సందర్భాల్లో కంటికి వాడే మందులు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిలో స్థిరాయిడ్ లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కొన్ని రకాల యాంటీబయాటిక్ కంటి చుక్కలాయిడ్స్ ఉంటాయి.. ఒకవేళ స్థిరాయిడ్ కలిగి ఉన్న మందులు కనుక వాడినట్లయితే కళ్ళకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.  కాబట్టి కంటిలో ఎర్రబడడం గాని ప్రమాదం. ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే డాక్టర్ల సలహా తీసుకోవాలి.  కొన్ని వేలల్లో  కంటిని తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడం కష్టంగా ఉంటుంది.  పెద్దల్లో అయినా కంటి లోపల రక్తస్రావం జరగడం వల్ల కూడా కన్ను అనుకోకుండా ఎర్రగా మారిపోవచ్చు.  కన్ను అనుకోకుండా ఎర్రగా మారిపోతే రక్తపోటు ఎక్కువగా నమోదు కావడం కూడా కొన్ని సందర్భాల్లో గమనించవచ్చు.  ఒక్కోసారి కంటి లోపల కొన్ని ఒత్తిడి  పెరగడం వల్ల కూడా కన్ను ఎర్రగా మారిపోతుంది.  కంటి లోపల ఒత్తిడి పెరగడాన్ని నీటి  కాసులు లేదా గ్లూకోమా అంటారు.  ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి గా  అభివర్ణించాల్సి వస్తుంది.  ఇలా కన్ను ఎర్రగా మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కాబట్టి కన్ను ఎర్రగా మారగానే అందుబాటులో ఉన్న మందులు వాడకుండా అసలు కన్నెందుకు ఎర్రగా మారింది అనేది తెలుసుకోవడం చాలా అవసరం.  కన్ను ఆకారాన్ని బట్టి చికిత్స తీసుకోవడం ఎంతైనా మంచిది. కానీ ఎర్రగా మారగానే కచ్చితంగా కంటి నిపుణులను సంప్రదించండి.

హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు  HealthPage యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. 

Comments