మునగ చెట్టుతో ఎన్ని లాభాలో తెలుసా?...

మునగ చెట్టుతో ఎన్ని లాభాలో తెలుసా?...

నిత్యజీవితంలో  మునగ చాలా  అవసరం...


మునగాకు ప్రాముఖ్యత: ఈ ప్రపంచంలో లభ్యమయ్యే అనేక రకాల సంపదలు మనకి బాహ్య అంతర్భాగాలుగా మన మనుగడకి ఆరోగ్యానికి జీవనానికి పోషణకి ఎంతో ఉపకరిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో ఆకూరలు, కాయగూరలు, పండ్లు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు కొన్ని రకాల పుష్ప జాతులు ఆహారంగా శరీరానికి పోషణని శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.  దేనినైనా తగిన విధంగా వినియోగించుకునే  నేర్పు మనిషికి ఉంది.  ఇటువంటి ప్రయోజనాత్మకమైన వాటిలో మునగా ఒకటి. మునగ శాస్త్రీయ నామం మొరింగా ఒలిఫేరా.  ఇది మొరింగేసి కుటుంబానికి  చెందిన చెట్టు ఇది. సాధారణంగా ఉష్ణ ప్రదేశాలలో విరివిగా పెరుగుతుంది.  భారతదేశంలో అమెరికా, శ్రీలంక దేశాల్లో ఈ మునుగని విస్తారంగా పెంచుతున్నారు.  ఈ మునగా అనేక ప్రయోజనాలతో నిండి ఉన్న ఒక ప్రత్యేకమైన వృక్షం.  మునగ  చెట్టు నుండి లభ్యమయ్యే కాయలు, ఆకులు, పువ్వులు కూడా ఎంతో ఉపయోగకరమైనవి. మన దేశంలో ప్రతి వారి ఇంట పెరటిలో దాదాపుగా మునగ చెట్టు తప్పక ఉంటుంది.  పులుసులోనూ కూరగాయను ఉపయోగించడమే కాకుండా ఊరగాయగా కూడా చాలామంది వాడుతారు.  ఈ కాయ గింజలు వేయించి కూడా తినవచ్చు .మునగకాయ గింజలలో 40 శాతం వరకు నూనె ఉంటుంది.  ఇది వంట నూనెగా ఉపయోగిస్తారు. ఈ మునికాయలో ఔహేనిక్ ఆమ్లము అధిక సంఖ్యలో ఉండటం వల్ల దీని నుంచి తీసిన నూనెను కూడా బెన్ ఆయిల్ అని అంటారు. మునగ కాయల పిప్పిని ఎరువుగా వాడుతారు . 

మునగ చెట్టుతో ఉపయోగాలు:చెట్టు బెరడు వైద్య విధానాల్లోఅంతేకాకుండా నీటి శుభ్రపరిచే ప్రక్రియలో ముఖ్యంగా వాడుతారు. మునగాకుల రసం సేవించడం వలన ఎముకలకు అవసరమైనటువంటి కాల్షియం, మెగ్నీషియం, బాస్వరం వంటి వాటిని శరీరానికి అందుతాయి. దాని వల్ల శరీరంలోని హానికరమైన పదార్థాలు మూత్రం ద్వారా వెళ్లిపోతాయి.
అల్సర్, కడుపునొప్పి సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. మునగలో ఉండే పీచు పదార్థం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఆంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. విటమిన్ సి మరియు పొటాషియం కూడా మునగాకుల్లో ఎక్కువగా లభిస్తుంది. మునగ కాయను ఆయుర్వేదంలో దాదాపు 300 లకు పైగా చికిత్సలకు వినియోగిస్తారు. 

       చెట్టు బెరడా వైద్య విధానాల్లో విరివిగా ఉపయోగించడం జరుగుతుంది.  జమైకా దేశంలో దీని కాండం నుంచి నీలిరంగులు తయారు చేస్తారు.  ఇక ఆయుర్వేద వైద్య విధానంలో ఈ మునగ కాయలు, ఆకులు, పువ్వులు, కాండం అన్నింటిలోనూ ఔషధ గుణాలు అధికంగా ఉండడం చేత అధికంగా ఉపయోగిస్తున్నారు. మునగలో విటమిన్ సి విటమిన్ ఏ క్యాల్షియం పుష్కలంగా లభ్యమవుతాయి.  నిత్యజీవితంలో మనం ఎదుర్కొనే  కొన్ని సమస్యల రుగ్మతుల్ని పోగొట్టే శక్తి మునగలో ఉంది.  శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు ఈ మునగ ఒక్కదానిలో ఉన్నాయి. అలాగే సెక్స్ సమస్యలకి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. వీర్యవృద్దికి ఎంతగానో దోహదం చేస్తుంది.  మునగ చెట్టు బెరడను పాలతో మరిగించి,  ఆ కషాయాన్ని ప్రతిరోజు మూడు పూటలా సేవిస్తూ ఉంటే వీర్య వృద్ధి కలిగి అంగస్తంభన సమస్య తీరిపోతుందనే నమ్మకం.  మునగాకులు ఎండబెట్టి, పొడి చేసుకుని సేవిస్తూ ఉంటే రక్తపోటు  అరికడుతుంది.  మధుమేహం వ్యాధితో బాధపడేవారు కూడా దీనివలన ఎంతో ప్రయోజనం పొందుతారు.  ఇక ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మునగ ప్రపంచ మార్కెట్లో సుమారు 20 నుంచి 30% ఆదాయాన్ని సమకూర్స్తుంది.  దీనివిధిగా దీనిని అందరూ పెంచి వినియోగిస్తూ ఉంటే శరీర ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. 

హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు  healthpage యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.


Comments