పుట్టబోయే పిల్లల పై డౌన్స్ సిన్డ్రోమ్ ఏ విధమైన ప్రభావాలు చూపెడతాయి?..

పుట్టబోయే పిల్లల పై డౌన్స్ సిన్డ్రోమ్ ఏ విధమైన ప్రభావాలు చూపెడతాయి?..

ఏ వయసుకు ఆ ముచ్చట అన్నారు పెద్దలు.  మహిళల్లో గర్భధారణ ఆలస్యం అవుతున్న కొద్దీ..... పుట్టబోయే బిడ్డలు కొన్ని మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి.  అందుకే బిడ్డను కనాలని ప్లాన్ చేసుకోవాలనుకునేవారు మరి ముఖ్యంగా లేటు వయసులో గర్భధారణ కోరుకునేవారు ఆ సమయంలో పుట్టబోయే బిడ్డకు వచ్చే అవకాశం ఉన్న డౌన్స్ సిండ్రోమ్ గురించి అవగాహన తప్పక పెంచుకోవాలి.   ఒక్కో జీవికి నిర్దిష్టమైన క్రోమోజోముల సంఖ్య ఉంటుంది.  వాటిని బట్టి ఆ జీవి ఏమిటన్నది నిర్ణయం అవుతుంది.   మనిషిలోని క్రోమోజోముల  సంఖ్య 46.  అందుకే ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు పురుషుడి వీర్యకణం అండంతో కలిసినప్పుడు ఈ 23 జత లు కలుసుకొని 46 క్రోమోజోములతో కొత్త జీవి ఆవిర్భవించేలా చేస్తుంది ప్రకృతి.   మరి ఏదైనా కారణాలవల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే? అది స్వభావికం కాదు.  అలాంటి పరిస్థితుల్లో సాధారణ మనిషిలో కొన్ని అసాధారణమైన రుగ్మతలు కనిపిస్తాయి. 

డాన్స్ సిండ్రోమ్ లో జరిగేది ఏమిటి?

ముందుగా చెప్పుకున్నట్లు మనుషులో 46 క్రోమోజోములు  ఉంటాయి.  ఏదైనా కారణాల వల్ల ఈ సంఖ్య కాస్త 47కు చేరు చేరింది అనుకోండి..  అప్పుడు సంభవించేదే డాన్స్ సిండ్రోమ్ అనే అసాధారణ స్థితి.  అంటే ఇందులో 21వ క్రోమోజోము కాపీ మరొకటి అదనంగా ఏర్పడుతుంది.  ఫలితంగా 46 క్రోమోజోములు కాస్త 47 గా మారిపోతాయి.  ఇలా జరిగితే ఈ కండిషన్లో పిల్లలకు కొన్ని మానసికమైన లోపాలు కనిపిస్తుంటాయి.  ఇంగ్లాండుకు చెందిన జె.ఎల్. డౌన్ అనే ఫిజీషియన్ ఈ పరిస్థితికి కారణాన్ని కనుగొనడంతో ఆయన పేరిట దీనికి డౌన్ సిండ్రోమ్ అని పెట్టారు.  డాన్ శీను పిల్లల్లో కనిపించే లోపాలు సాధారణంగా డౌన్స్ సిండ్రోమ్. పిల్లల్లో కనిపించే లోపాలు సాధారణంగా డాన్స్ సిండ్రోమ్తో పుట్టిన పిల్లల్లో  కొన్ని శారీరక, మానసిక లోపాలు కనిపిస్తాయి.  వాటిలో  ముఖ్యమైనవి కండరాలా పట్టుత్వం తగ్గి ఉండటం.  మెడ వెనుక భాగంలో చర్మం దళసరిగా ఉండటం.  ముక్కు చప్పిడిగా ఉండటం(ఫాటెస్ట్  నోస్ ).  పుర్రె లోని ఎముకల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉండటం.  సాధారణంగా మన అరచేతిలో పైన రెండు గీతాలు ఉంటాయి.  కానీ డౌన్స్ సిండ్రోమ్ ఉన్నవారి అరచేతిలో ఒకటే గీత ఉంటుంది.  చెవులు చిన్నవిగా ఉండటం, నోరు చిన్నదిగా ఉండటం, కళ్ళు పై వైపునకు వాలినట్టుగా ఉండటం, కంట్లో  నల్ల గుడ్డులో తెల్ల మచ్చలు ఉండటం,  ఎత్తు పెరగకపోవడం, మానసిక వికాసం ఆలస్యంగా జరుగుతుండడం.

మరికొన్ని అదనపు సమస్యలు.: 

గుండెకు సంబంధించిన లోపాలు కనిపించవచ్చు. మతిమరుపు, కాటరాక్టు  వంటి కంటి జబ్బు సమస్యలు, జీర్ణకోశ వ్యవస్థలో సమస్యలు, తొంటి ఎముక తన స్థానం నుంచి తొలగిపోవడం,  మలబద్ధకం,  హైపోథైరాయిడిజమ్ వంటి శారీరక సమస్యలు రావచ్చు. 

నిర్ధారణ:

 డౌన్స్ సిండ్రో మ్ ఉందని నిర్ధారణ చేయడానికి క్రోమోజోముల పరీక్షల ను నిర్వహించాలి.  దీని కోసం చిన్నారి నుంచి సేకరించిన రక్తంతో కారియోటైపిక్ క్రోమోజోమల్ స్టడీ అనే రక్త పరీక్ష చేయాలి.  ఈ ప్రధాన పరీక్షలతో పాటు గుండెలో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి ఈసీజీ, చాతి, జీర్ణకోశ వ్యవస్థ తాలూకు పరిస్థితిని తెలుసుకోవడానికి ఎక్స్రే పరీక్షలు చేయాలి.  క్రమం తప్పకుండా చేయించాలి ఈ పరీక్షలు.  

డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయిస్తూ ఉండాలి. .  అవి చిన్నతనంలో ప్రతి ఏడాది కంటి పరీక్షలు చేయించాలి.  ప్రతి ఏటా థైరాయిడ్ పరీక్షలు చేయిస్తూ ఉండాలి. బిడ్డ పుట్టకముందే నిర్ధారణ ఎలా....? 

వివాహం ఆలస్యంగా చేసుకోవడమో లేదా ఏదైనా కారణాలవల్ల ఆలస్యంగా పిల్లలను ప్లాన్ చేసుకోవడం చేస్తే పుట్టబోయే చిన్నారిలో డౌన్స్ సిండ్రోమ్ కండిషన్ వచ్చేందుకు అవకాశం ఉందా అన్న విషయాన్ని కొన్ని పరీక్షల ద్వారా ముందే తెలుసుకోవచ్చు.  వైద్య నిప్పుని ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు  చాలా వరకు మంచి సమాచారాన్ని అందిస్తాయి.  కానీ పరీక్షల పూర్తి ఖచ్చితమైన సమాచారం బిడ్డ పుట్టిన తర్వాతే లభ్యమవుతుందని గుర్తించాలి.

హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు  healthpage యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.


Comments