పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా?...

ఇటీవల నొప్పి నివారణ మందుల వాడకం సాధారణం అయింది.  డాక్టర్ చీటీ లేకుండానే ఇలాంటి మందులు ఉపయోగించడం పరిపాటి అయింది.  అయితే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థరైటిస్, ఆస్టియో, ఫ్లోరోసిస్, డయాబెటిస్ వంటి వ్యాధుల తీరు తెన్నుల్లోనూ ఇన్ఫెక్షన్స్, జబ్బుల్లోనూ మార్పులు వచ్చాయి.  కాబట్టి ఎప్పుడో  డాక్టర్లు చెప్పిన మందులు ఇప్పుడు వాడటం సరికాదు.  పైగా ఆర్థరైటిస్, స్టాండ్యో లైటిస్, ఆస్టియో, ఫ్లోరోసిస్, క్యాన్సర్ వంటి జబ్బుల  మందుల్లో కొత్త రకాలు కూడా వచ్చాయి.  అందుకే మునుపు ఎప్పుడో పేర్కొన్న మందులు డాక్టర్లను సంప్రదించకుండా అదే పనిగా వాడటం మంచిది కాదు.   డాక్టర్ను సంప్రదించాకే మందులు మరీ ముఖ్యంగా నొప్పి నివారణ మందులు వాడాల్సి ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం నొప్పి నివారణకు మందులు వాడేవారులు 54% మందిలో వాటి దుష్ప్రభావాలపై అవగానే ఉండదు. 

నొప్పి నివారణ మందుల దుష్పరిణామాలు.. 

పేరుకు తగినట్లు పెయిన్ కిల్లర్స్ వెంటనే  ఉపశమనం ఇస్తాయి.  అయితే వాటిని కొద్ది మోతాదులోనే వాడాల్సి ఉంటుంది.  మోతాదు మించితే అవి శరీరంపై ఎన్నో దుష్పరిణామాలను కలగజేస్తాయి.  అధిక చికిత్సకు అవి ఒక వరప్రసాధిని అయినా వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ముఖ్యంగా అవి పొట్టలోని లోపలి పొరలు మొదలుకొని రక్తనాళాల్లోని లోని పొరల వరకు లోపలి వైపునకు ఉండే పొరలు దెబ్బతింటాయి.  ప్రధాన రక్తనాళాల చివరన ఉండే సన్నటి నాళాలు మూత్రపిండంలోని అతి సన్నటి నాళాలు దెబ్బతింటాయి.  దానికి తోడు కొంతమందిలో వాంతులు, వికారం వంటివి కూడా కనిపిస్తాయి.  మామూలుగానే అయితే కొన్ని యాంటీ బయటిక్  తీసుకుంటూ నాలుగైదు రోజులు మాత్రమే నొప్పి నివారణ మందులు వాడాలి.  అదే పనిగా అంతకుమించి వాడకూడదు. 


మరికొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలు ‌..

రెండు లేదా మూడు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకునే వారిలో కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అందులో మూత్రపిండాలకు వచ్చే నెప్రోపతి అత్యంత ప్రమాదకరం.  మన శరీరంలో రోజువారి వడపోత సక్రమంగా జరగాలంటే మూత్రపిండాల్లో 30% అయినా సరిగా పనిచేయడం అవసరం.  నొప్పి నివారణ మందులు వాడేవారిలో ఈ సామర్థ్యం దెబ్బతింటుంది.  అయితే మూత్రపిండం దెబ్బతిన్న మళ్లీ మునుపటి సామర్థ్యం పుంజుకుంటుంది.  కొంతమందిలో ఇలా మళ్లీ పొంచుకొని వారిలో పరిస్థితి ప్రమాదకరం అవుతుంది.  ప్రపంచవ్యాప్తంగా ఇలా నొప్పి నివారణ మందులతో కిడ్నీ సమస్యలు వచ్చినవారు చాలా ఎక్కువ. కొందరిలో  ఈ మందుల వల్ల అధిక రక్తపోటు వల్ల రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతింటాయి.  ఇలాంటి వాటితో  గుండె  మరింత ఒత్తిడి పడి గుండె జబ్బులు రావచ్చు. ఈ మందులు పరిమితికి మించి వాడడం వల్ల కడుపులోని లోపల ఉండే పొరలు దెబ్బతినవచ్చు.  ఇలాంటి వారిలో కొందరికి మేజర్ సర్జరీ కూడా అవసరం రావచ్చు. కొందరిలో రక్తం గడ్డ కట్టడానికి  ఉపయోగపడే వెయిట్ లెస్ పై దుష్ప్రభావం పడి, కోమోక్యూపతి  వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీయవచ్చు. 

కొన్ని జాగ్రత్తలు..

నొప్పి నివారణ మందులు తప్పనిసరిగా వాడాల్సిన వారు వాటి దుష్ట పరిణామాలను  తగ్గించుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.  అవి పడిగడుపున నొప్పి నివారణ మందుల్ని వాడకూడదు.  ఇలాంటివి వాడే సమయంలో తరచూ మూత్రపిండాల పనితీరు చెక్ చేయించుకుంటూ ఉండాలి. 

పెయిన్ కిల్లర్ తో కిడ్నీ క్యాన్సర్...

నొప్పి తగ్గేందుకు వాడే ఔషధాల మోతాదు అధికమైతే మూత్రపిండాల  క్యాన్సర్ కి దారి  తీస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.  ఐబుప్రోఫెన్ లాంటి నొప్పులను తాత్కాలికంగా తగ్గించే మాత్రల ను పదేళ్లపాటు వాడితే మూత్రపిండ క్యాన్సర్ వచ్చే ప్రమాదం  మూడు రెట్లు  ఎక్కువ అని బోస్టన్ లోని హార్వర్డ్ వైద్య పాఠశాల పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఈ పెయిన్ కిల్లర్ ను వాడడం వల్ల అవి కిడ్నీ క్యాన్సర్ రావడానికి 51% దోహదం చేస్తాయని, అధ్యయనానికి నేతృత్వం  వహించిన ఎస్. యాంగ్ షో తెలిపారు. దశాబ్ద కాలం పెయిన్ కిల్లర్స్ ను వాడుతున్న లక్ష మందిపై అధ్యయం చేయగా వారందరూ మూత్రపిండ కణాల క్యాన్సర్ తో భారతదేశంలో పడుతున్నారని వెళ్లడైందని డైలీ మెయిన్ లో పేర్కొన్నారు.  నాన్ స్టెరాయిడ్ లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ డ్రగ్ ఎక్కువ కాలం వాడితే ఆర్సీసీ రావడానికి అవకాశం ఉంది.  దీనికి చికిత్స చేయడం చాలా కష్టంతో కూడుకున్నది.  ఈ రుగ్మతు వచ్చిన వారు మూడింట ఒక వంతు మాత్రమే జీవించే అవకాశం ఉంది. 

హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు  www.healthpage.in యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.


Comments