అత్యధికమైన ఒత్తిడి హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు స్థితిలో వ్యక్తులలో సాధారణ స్థాయి కన్నా ఎక్కువ రక్తపోటు ఉంటుంది. ఈ పరిస్థితి ఇతర ప్రమాదకర వ్యాధులకు దారి తీయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. సరైన సమయంలో దీనికి చికిత్స చేయించుకోకపోతే దానివల్ల దుష్పరిణామాలు కలుగుతాయి. గుండె మెదడు మూత్రపిండాలు కళ్లపైన ఇది ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటును వైద్య పరిభాషలో హైపర్ టెన్షన్ అని పిలుస్తారు. శరీరంలోని వివిధ భాగాలకు గుండె రక్తాన్ని పంపు చేసే సమయంలో రక్తం ధమనుల గోడల్ని ఢీకొన్నప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది. దీనినే బ్లడ్ ప్రెషర్ అంటారు. గుండె సంకోచించే స్థాయి గుండె సామర్థ్యం రక్త ప్రసరణ వ్యవస్థలో రక్త పరిణామం ధమనుల ఆకారంపై ఈ ప్రెషర్ ఆధారపడి ఉంటుంది. పలు అంశాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయి. మొదటిసారి పరీక్షించిన సమయంలో అధిక రక్తపోటు గనుక ఉంటే మీకు ఈ సమస్య ఉన్నట్లు కాదు ఎందుకోసం చాలాసార్లు చెకప్ చేయించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అధిక రక్తపోటు ఉన్నది లేనిది డాక్టర్ అంతిమంగా నిర్ణయిస్తారు. బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటును కొలిచే రెండు రకాల రీడింగ్లను పరిగణలోకి తీసుకుంటారు. ఈ రీడింగులు గుండె రక్తాన్ని పంపిని చేసే రెండు స్థితులను సూచిస్తాయి. బ్లడ్ ప్రెషర్ ను రెండు సంఖ్యలతో నిర్ణయిస్తారు. మొదటి దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. అంటే గుండె సంకోచించి మొదటగా బ్లడ్ విజల్ అంటారు. సర్క్యూట్ పై చేసిన ఒత్తిడి తాలూకు స్థాయిని సూచిస్తుంది .
రెండవదైన డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే గుండె కొట్టుకునేటప్పుడు రిలాక్స్ అయ్యే సమయంలో కలిగే ఫ్రెషర్ సూచిస్తుంది. మీ గుండె శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని ఎలా పంపిస్తుందనేది దీన్ని బట్టి మీ డాక్టర్ తెలుసుకుంటారు.ఎప్పుడు రక్త పోటు సాధారణ స్థాయి కన్నా అధికంగా ఉంటుందో అది ప్రమాదానికి సంకేతం. ఈ స్థితిలో శరీరంలోని ముఖ్య భాగాలైన గుండె, మెదడు, మూత్రపిండాలపై అధిక ఒత్తిడి ఏర్పడుతుంది. దానివల్ల గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటుకు మధుమేహం స్థూలకాయం తోడైతే దాన్ని నియంత్రించడం చాలా కష్టం.
రక్తపోటు పెరగడానికి కారణాలు:
తల్లిదండ్రులలో అధిక రక్తపోటు ఉన్నట్లయితే వారి సంతానానికి ఈ లక్షణాలను వచ్చే అవకాశం ఉంది. మహిళలతో పోలిస్తే పురుషులలో చిన్న వయసులోనే ఇది ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా 30 ఏళ్ల దాటిన వ్యక్తులలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా వంశానుగతంగా రక్త పోటు కనుక వస్తే క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. రక్తపోటును పూర్తిగా నియంత్రించేందుకు జీవనశైలిలో మార్పులు అవసరం. జీవన శైలికి సంబంధించిన కొన్ని విషయాలు దీనిని అధికంగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు స్థూలకాయం.. ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం మద్యపానం, సిగరెట్టు, వ్యాయామం లేకపోవడం కొన్ని మందుల రసాయనాలు చింతన, ఉద్రేకం బాధ మొదలైనవి. జీవశైలి కారణంగా రక్తపోటు ఎక్కువగా ఉంటే ఆహారం విషయంలోనూ, వ్యాయామం విషయంలోనూ కొన్ని అలవాట్లను మార్చుకోమని డాక్టర్లు సూచనలు ఇస్తారు. మద్యం, సిగరెట్టు మానివేయమని కూడా చెప్తారు. డయాబెటిస్ తో బాధపడే వారిని షుగర్ ను అదుపులో ఉంచుకోమని చెబుతారు. రక్తపోటు ఎక్కువైనప్పుడు ఎక్కువ బత్తిడి కలుగుతున్న అనుమానం కలుగుతుంది. కొన్ని రోజులపాటు రక్తపోటు ను పదేపదే పరీక్షించి నిర్ధారిస్తారు. 40 సిస్టోలిక్ 90 డయాలసిస్టోలిక్ కంటే ఎక్కువగా ఉంటే రక్తపోటును హై పవర్ టెన్షన్ గా పరిగణిస్తారు. తీవ్రమైన ఒత్తిడి ఏర్పడడం వల్ల పలు శారీరక సమస్యలు ఏర్పడతాయి.
అధిక రక్తపోటు కారణంగా ఏర్పడే సమస్యలు:
అధిక రక్తపోటు వల్ల గుండె గుండె జబ్బులు, దృష్టి సమస్యలు, రక్తనాళాలు పాడవడం, పెద్ద దమని చిట్టి పోవడం, మూత్రపిండాలు దెబ్బతినటం, మెదడు దెబ్బతినటం.
క్రమం తప్పని జాగ్రత్తలు:
శరీర బరువును తగ్గించుకోవాలి. రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది. ఎత్తుకు తగిన నిష్పత్తిలో కాక ఎక్కువ బరువు ఉన్నట్లయితే ఆహార నియంత్రణలు పాటిస్తూ వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సాధారణ ఆరోగ్యంతో ఉన్న ఒక వ్యక్తి రోజుకు ఒకటి పావు స్పూను కన్నా ఎక్కువ ఉప్పు వాడకూడదు. ఆహార పదార్థాలపై ఉప్పు చల్లుకుని తినే అలవాటు మానుకోవాలి. ఉప్పు మోతాదు తక్కువ ఉంటే తాజా పళ్ళు కూరగాయలని వాడాలి. తాగుడు వ్యసనం ఉంటే దానిని తగ్గించుకోవాలి. పొగ తాగడం మానేయాలి. సిగరెట్ తాగడం వల్ల రక్తపోటు ఐదు నుంచి పది ఎమ్మెస్ హెచ్ జి అధికం అవుతుంది. అంతేకాక అవి గుండె జబ్బులను స్ట్రోక్ రిస్కును పెంచుతుంది. వ్యాయామం చేయడం ఎంతో ఉపయోగకరం. అధిక రక్తపోటు స్థూలకాయం మధుమేహం గుండె జబ్బులను నియంత్రించేందుకు నియమిత ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే చేతులు కాళ్లలో రక్తప్రసరన జరుగుతుంది. ఈ వ్యాయామం త్వరగా గుండెపై ప్రభావం చూపించి, గుండె సామర్ధ్యాన్ని పెంచుతాయి. తోట పని, ఇంటి పని చేయడం వల్ల ఆరోగ్యం చాలాకాలం పాటు మెరుగ్గా ఉంటుంది. ఎవరికివారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వయసు పెరుగుతుంటే రక్త పోటుకు కారణం ఏదైనా కావచ్చు. కానీ డాక్టర్ సూచనలు పాటించి, జీవనశైల్లో మార్పులు చేసుకోవడం వల్లనే దీన్ని అదుపులో ఉంచుకోగలమని విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి.
అధిక రక్తపోటు లక్షణాలు:
హైపర్ టెన్షన్ నిశ్శబ్ద అంతకునిగా పేర్కొంటారు. దీని లక్షణాలేవి బయటకి కనిపించవు. చెకప్ చేసుకోవాలని కొంత వరకు చాలా మందికి ఈ విషయం తెలియదు. ప్రతి నలుగురిలో ఒక వ్యక్తికి తన రక్తపోటు గురించిన అవగాహననే ఉండదు. అప్పుడప్పుడు తలనొప్పి, అలసట, చింతన, దృష్టి లోపాలు, వాంతి కావడం, అధికంగా చెమటలు పట్టడం, ముఖం పాలిపోవడం, ఇతర భాగాలు ఎర్రబారటం, మజిల్ ట్రేమర్స్ ఎంజాయ్ వంటి నొప్పి చాతిని గట్టిగా నొక్కినట్లు నొప్పి రావడం, ముక్కు నుంచి రక్తం కారడం, గుండె చప్పుడు ఎక్కువ కావడం, చెవులలో శబ్దాలు రావడం మొదలైనవి. ఒకవేళ మీరు లావుగా ఉంటే బరువు తగ్గించుకోండి. అవసరానికి కన్నా ఎక్కువ బరువు మీ గుండెకు బారాన్ని పెంచుతుంది. వ్యాయామం చేయండి. చివరిగా డాక్టర్ సలహాలు పాటించండి.
హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు healthpage యాజమాన్యం బాధ్యత వహించదు. ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.
Comments
Post a Comment