భోజనానికి ముందు ఈ పండు తింటే ఇమ్మ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు...

భోజనానికి ముందు ఈ పండు తింటే ఇమ్మ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు...


ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలోకి మార్చిన అంజీర పండ్లు మార్కెట్లో మనకు లభ్యమవుతున్నాయి.  వీటిని అందరూ చూసే ఉంటారు.  అయితే డ్రై ఫ్రూట్స్ రూపంలో దొరికే  అంజీర పండ్లే కాదు సాధారణ అంజీర పండును తింటే దాంతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.  ముఖ్యంగా ఈ పండును రెండు పూటలా భోజనానికి ముందు తింటే ఇమ్మ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు & అనేక అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు.  అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

  • అంజీర పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.  ఇది మనం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం  చేసేందుకు ఉపయోగపడుతుంది.  జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.  గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలన్నీ దూరమవుతాయి. 
  • అంజీరలో  పొటాషియం, సోడియం బాగా లభిస్తాయి.  ఇవి రక్తపోటు, బిపి సమస్య నుంచి ఉపశయనాన్ని కలిగిస్తాయి.  బీపీని కంట్రోల్ గా ఉంచుతాయి.
  •  రక్తహీనత సమస్య నేడు చాలామందిని బాధిస్తోంది.  అలాంటివారు నిత్యము రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తిన్నట్లయితే వారిలో రక్తం బాగా అభివృద్ధి చెందుతుంది.  హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతాయి.  
  • మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ  వంటి విష జ్వరాల బారినపడి,  ప్లేట్లెట్స్తగ్గిన వారికి ఈ పండ్లను తినిపిస్తే వెంటనే ప్లేట్లెట్స్ పెరిగే అవకాశాలు ఎక్కువే!.  
  •  అంజీర్ పండ్లను రెండు పూటలా భోజనానికి ముందు తింటే దాంతో పొట్ట నిండిన భావన కలుగుతుంది.  దీనివల్ల ఎక్కువగా ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.  ఫలితంగా బరువు కూడా తగ్గుతాయి.
  •  అంతేకాదు అంజీరా లో ఉండే పోషకాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ఐదు నిత్యం అంజీర పండ్లను తింటుంటే గుండె సంబంధం సమస్యలు కూడా దూరమవుతాయి.  
  • అంజీర పండు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.  రక్తాన్ని శుద్ధి చేస్తుంది.   అంజీర్ పండ్లలో మెగ్నీషియం, మాంగనీస్, జింక్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి సంతానం కావాలనుకునే వారికి కూడా  మేలు చేస్తాయి.   శరీరంలో  రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.  క్యాన్సర్ కు కారణమయ్యే పదార్థాలు నాశనమవుతాయి.
  •  అంజీర పండ్లు మధుమేహం ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. భోజనానికి ముందు వీటిని తింటే అనంతరం రక్తంలో షుగర్ స్థాయిలు అంతగా పెరగవు.  అస్తమా వంటి శ్వాస కోసం సమస్యలు ఉన్నవారు అంజీర  పండ్లను తింటే అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.   
  • అంజీర  పండ్లలలో క్యాల్షియం కూడా పుష్కలంగానే ఉంటుంది.  వీటిని తినడం వల్ల ఎముకలు దృఢమవుతాయి.  ఎముకలు విరిగి ఉన్నవారికి వీటిని పెడితే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.   
  • గొంతు నొప్పి ఉన్నవారు అంజీర పండ్లను తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.  దగ్గు కూడా తగ్గుతుంది.  జ్వరం, చెవి నొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు ఉంటే అంజీర పండ్లను తినాలి.  దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు healthpage యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.

Comments