తమలపాకులో అనేక ఔషధ గుణాలు...

తమలపాకులో అనేక ఔషధ గుణాలు...

తమలపాకు ప్రాముఖ్యత: 


మలేషియా నుంచి 2000 వేల ఎండ్ల క్రితం ఆసియా దేశాలన్నింటికీ  వ్యాపించిన తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మెరియపు జాతికి చెందిన తమలపాకు అనేక సాధారణ రుగ్మతులను న్యాయం చేస్తుంది.  శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉపయోగించే తమలపాకు భారతీయ సంస్కృతిలో  ఒక భాగం.  విందు భోజనం తర్వాత తమలపాకు కిల్లి వేసుకోవడం భారతీయుల ప్రత్యేకత.  పండుగలో, పెళ్లిలో, పూజల్లో తమలపాకు తప్పనిసరిగా ఉండాల్సిందే! రాజు పేద తేడా లేకుండా అందరిని రంజింపజేసే తమలపాకు పుట్టినిల్లు మలేషియా.  2000 సంవత్సరాల క్రితమే ఇది ఆసియా తూర్పు ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది.  

ఉపయోగాలు: 

తమలపాకు సేవనం వల్ల మనసుకు ఉత్తేజం కలుగుతుంది.  జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.  తలనొప్పి పంటి నొప్పి కీళ్ల నొప్పులకు తగ్గిస్తుంది.  చిగుళ్ల వ్యాధులకు కూడా ఇది మంచి ఔషధం.  రక్తస్రావాన్ని అరికడుతుంది.  సాధారణ రుగ్మతలకు తమలపాకును వాడే ఆచారం మన దేశంలో ప్రాచీన కాలం నుంచి ఉంది.  మలేషియాలో తల  నొప్పికి, కీళ్ల నొప్పులకు మొదట తమలపాకు ని ఉపయోగించి చూస్తారు.  తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి శరీరానికి  రాసుకుంటే వొంటి  నొప్పి మటుమాయం అవుతుందని థాయిలాండ్ చైనా ప్రజల విశ్వాసం.  ఇండోనేషియాలో తమలపాకు పక్కా నమిలి మింగితే దగ్గు ఆస్తమా నయమవుతాయని నమ్ముతారు.  తమలపాకులు ఉండే మేలు రకం విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగవుతుంది.  హైదరాబాదులో రూపాయి పాన్ నుంచి కొన్ని వేల రూపాయల వరకు లభిస్తాయి.  తమలపాకుతో  టీ తయారు చేసుకోవచ్చు. రెండు కప్పుల నీళ్లు ఏడు తమలపాకులు వేసి మరగబెట్టాలి నీళ్లు మరిగిన ఒక కప్పు కషాయంగా మారిన తర్వాత చల్లార్చి తాగితే జలుబు దగ్గు నొప్పులు నయమవుతాయి. తేలికపడిన అనుభూతి కలుగుతుంది.

తమలపాకు రకాలు:

తమలపాకు మొక్క తీగ జాతికి చెందినది.  ఉష్ణ మండలం ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది.  ఫైబర్ బీటెల్ అనే మెరియపు జాతికి చెందినది.  తమలపాకులో అనేక రకాలు ఉన్నాయి మామూలు తమలపాకులు అరచేతిలో సగం ఉంటాయి.  కలకత్తా బనారసి తమలపాకులు 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.  కలకత్తా ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో సుగంధంతో ఉంటుంది.  బనారస్ ఆకు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటుంది.  కలకత్తా ఆకులను మంచి డిమాండ్ ఉంది.  మానవులు 2000 సంవత్సరాల క్రితం నుండి తమలపాకులు సేవిస్తున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.  పాలి భాషలో రాసిన శ్రీలంక చారిత్రక గ్రంథం మహా వంశ లో తమలపాకు ప్రస్తావన ఉంది.  తమలపాకులో వివిధ సుగంధ ద్రవ్యాలు వేసి కట్టే పాన్ లకు హైదరాబాద్ ఢిల్లీ అజ్మీర్ నగరాలు ప్రసిద్ధి చెందాయి.  

హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు  healthpage యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.

Comments