ఆస్తమా... జాగ్రత్త సుమా!

ఆస్తమా... జాగ్రత్త సుమా!

ఆస్తమా లక్షణాలు:ఊపిరితిత్తులకు సంబంధించిన దమ్ము రోగం లేక ఉబ్బసం వ్యాధి దమ్ము అంటే ఊపిరి.ఊపిరి పీల్చడం వదలడం సర్వసాధారణంగా మనకు తెలియకుండానే సహజంగా జరుగుతుంది.ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న రోగి శ్వాస పీల్చాలన్న వదలాలన్నా చాలా ఇబ్బంది పడతారు. జాతిలో నొప్పితో కూడిన ఇబ్బంది కలుగుతుంది దగ్గు వస్తుంది గొంతులో మాటిమాటికి కఫం అడ్డుపడుతుంది. ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే నరాలకు సంబంధించిన వ్యాధిని బ్రాంకియల్ ఆస్తమా అంటారు. గాలిని బయటకు వదిలేటప్పుడు గురక వంటి శబ్దం వెలువడుతుంది. 
ఆస్తమాకు కారణాలు:
దమ్ము రోగానికి రెండు ముఖ్యమైన కారణాలు
1. వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధి 
  పని చేసే చోట ఉన్న ప్రతికూల వాతావరణం.
తల్లిదండ్రులకు ఆస్తమా వ్యాధి ఉంటే తమ సంతానానికి కూడా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వయసులో ఉన్నప్పుడు ఆస్తమా లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు కానీ వయసు పెరిగే కొద్దీ ఈ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా మధ్య రాత్రి దాటిన తర్వాత బయటపడే అవకాశం ఉంది.
2. రెండవ రకం ఆస్తమా బొగ్గు గనుల ప్రాంతంలో పనిచేసే వారికి క్రషర్ వద్ద దుమ్ములో పనిచేసే వారికి వడ్రంగి పని చేసే వారికి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికి రంగుల వాసన పొగ వంటి ప్రతికూల వాతావరణంలో పని చేసే వారికి ఈ వ్యాధి సులభంగా సోకుతుంది.
మొదట శ్వాసకు ఇబ్బంది కలుగుతుంది పోను పోను అది ముదిరి దమ్ము రోగముగా మారుతుంది.
వాతావరణ కాలుష్యానికి గురి అయ్యే కార్మికులు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాధిని అదుపులో ఉంచడానికి వీలవుతుంది.

మనం ప్రతిసారి గాలిని పిలిచినప్పుడు దానిలోని ప్రాణవాయువు రక్తంలో కలిసి ఎడమవైపు ఉన్న గుండె ద్వారా శరీరంలోని అన్ని జీవకణాలకు అవయవాలకు చేరుతుంది. ఈ ప్రాణవాయువే శక్తినిస్తుంది. అదేవిధంగా ప్రతిసారి బయటకు వెళ్లే గాలి ద్వారా బొగ్గు పులుసు గాలి అనగా కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించిన రక్తం నుండి విడిపడి బయటికి వెలువబడుతుంది. ఊపిరితిత్తులకు చెడు రక్తం కుడి భాగం ఈ పని చేస్తుంది ప్రసారితం అవుతుంది. గుండెలో రెండు పంపులు ఒకటి చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరడానికి ఇంకొకటి మంచి రక్తాన్ని శరీరమంతటికి సరఫరా చేయడానికి పనిచేస్తున్నాయని అర్థమవుతుంది. చెడు రక్తం నుంచి బొగ్గు పులుసు గాలిని తొలగించి ప్రాణవాయువుతో కలిపే పనిని ఊపిరితిత్తులు చేస్తున్నాయి. ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తే గుండె కూడా చక్కగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పైనే ఇతర అవయవాల ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంది. రక్తప్రసరణ క్రియ, మల బహిష్కరణ ప్రక్రియ, కేంద్ర నాడీ మండలం, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తేనే సక్రమంగా జరిగేది. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం వల్ల ఈ ఆస్తమా వ్యాధి వల్ల ఈ ప్రక్రియలన్నీ మంద కోడిగా సాగడం వల్ల రోగి బలహీనంగా తయారవుతారు.

జాగ్రత్తలు:
సులభంగా జీర్ణమయ్యే సాత్వికాహారాన్ని తీసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకుంటూ రోజుకు నాలుగు ఐదు సార్లు నియమానుసారం గా తినాలి.
వెచ్చని దుస్తులు అనగా అవసరమైనప్పుడు ఉన్ని వస్త్రాలు ధరించి, శరీరాన్ని ముఖ్యంగా కాళ్లు, చేతులు, చాతి, తల, చెవులు వెచ్చగా ఉండేటట్లు జాగ్రత్త పడాల
                                                 
   

హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు  healthpage యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.

 




Comments