వొతైన జుట్టు ఆడ మగ తేడా లేకుండా ఎవరికైనా కీలకమైనదే!.
అందుకే బట్టతల బారిన పడ్డ వారి బాధ వర్ణనాతీతం. వైద్య రంగంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉన్నట్టే బట్టతల సమస్యకు అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. తల మీద ఉండే వెంట్రుకలు ఒక్కొకరిలో ఒక్కోలాగా ఉన్నా సాధారణంగా ఈ వెంట్రుకల కుదుళ్లు లక్ష నుండి లక్షన్నర వరకు వుంటాయి . ఒక్కో కుదుళ్ల జీవిత కాలం మూడు నుండి నాలుగు సంవత్సరాలు ఉంటాయి. తరువాత అవి రాలిపోయి కొత్తవి పుట్టుకొస్తాయి. కొందరిలో రకరకాల కారణాల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. చివరకు బట్టతల కూడా రావచ్చు.
జుట్ట్టు రాలిపోవడానికి కారణాలు...
పోషక ఆహార లోపం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఆడవారు గర్భం దాల్చినప్పుడు, మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్యం, వంశపారంపర్య తదితర కారణాలు కావచ్చు.
వైద్య రంగంలో బట్టతల నివారణ మార్గాలు:
1. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్: వివిధ రకాల కారణాల వల్ల జుట్టు రాలిపోతున్న స్త్రీ పురుషుల ఇద్దరిలోను.. చేసే హెయిర్ రీప్లేస్మెంట్ చికిత్సను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఈ చికిత్స తరువాత జుట్టు చాల సహజంగా కనిపించడమే కాకుండా శాశ్వతంగా కూడా ఉంటుంది. హెయిర్ రిస్టోరేషన్ సర్జరీకి దాదాపు 6 గంటల సమయం పడుతుంది. దీనిని లోకల్ ఎనస్థీషియాతో చేస్తారు. దీనిలో తల వెనుక వైపు లేదా కుడి ఎడమ వైపులా ఆరోగ్యాంగా ఉన్న జుట్టు కుదుళ్లను సేకరించి, జుట్టు రాలిపోయిన చోట అమరుస్తారు.
2. ఎఫ్ యూ టీ : ఫోలిక్యులార్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ ( స్టీఫ్ విధానం) ఎఫ్ యూ టీ లో స్ట్రిస్ టెక్నిక్ ను వినియోగిస్తారు. ఇందుకోసం తల వెనుక వైపున్న జుట్టును అక్కడి చర్మం తో సహా ఒక చిన్న ముక్కగా తీసుకుంటారు. ఈ ముక్కను చిన్న చిన్న ఫోలిక్యులార్ యూనిట్లుగా కత్తిరిస్తారు. మొదట జుట్టు తొలగించిన చోట వేసిన కుట్లను దాదాపు రెండు వారములలోగా తొలగిస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎఫ్ యూ టీ చాలా పాత పద్దతి.
3. ఆధునిక ఎఫ్ యూ ఈ : ఫోలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ లో ఒక ప్రత్యేకమైన పంచ్ తో 1 మిల్లి లీటర్ కంటే తక్కువ వ్యాసంలో తల నుండి జుట్టు కుదుళ్లను సేకరిస్తారు. ఈ టెక్నిక్ లో ఫోలిక్యులార్ యూనిట్లను వేరుగా సేకరిస్తారు. దీని కోసం ఎలాంటి కోత గాని కుట్టు గానీ ఉండవు.
4. స్టెంసెల్ ఇంజక్షన్ : ఆండ్రోజెనిక్ అలొపేషియా విధానంలో చికిత్స ఉంటుంది. స్త్రీ పురుషులలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ కెమికల్ రియాక్షన్ వల్ల డీహెచ్ టి గా మారుతుంది. దీని వలన తలలోని జుట్టు కుదుళ్ళపై దాడి చేయడం ప్రారంభమై కుదుళ్లను కొద్ది కొద్దిగా నాశనం చేస్తుంది. డీహెచ్ టి కుదుళ్లకు వెళ్లే రక్త ప్రసరణపై కుదుళ్ళ ఎదుగుదలకు కావలసిన సిగ్నల్స్ ను కుదుళ్లకు చేరకుండా నియంత్రిస్తుంది. రోజు రోజుకు జుట్టు పలచబడి చివరకు రాలిపోతుంది. ఈ సమస్య తలెత్తినపుడు స్టెంసెల్ ఇంజక్షన్ తీసుకోవడం వలన గ్రోత్ ఫ్యాక్టర్స్ దెబ్బతిన్న జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ చేయించి, మళ్ళీ జుట్టు ఎదుగుదల సిగ్నల్స్ ను అందజేయడం ద్వారా అవి పునరుత్తేజం అవుతాయి.
5. పిఆర్ పి ఇంజక్షన్: పిఆర్ పి వలన రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న వెంట్రుకలు కూడా ఆరోగ్యవంతంగా మారి, ఒత్తుగా పెరుగుతాయి. స్త్రీ పురుషులకెవరికైనా ఈ ఇంజక్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియల ద్వారా కొత్త జుట్టు పూర్తిగా పెరుగుతుంది. సహజంగా కూడా ఉంటాయి. ఇవి చాలా సురక్షితమైన ఫలవంతమైన విధానాలు. వీటి ద్వారా పెరిగిన జుట్టు కూడా ఎక్కువ కాలం పాటు రాలిపోకుండా ఉంటుంది. కోతలు, మచ్చలు, కుట్లు, నొప్పిలేని సరికొత్త చికిత్సా విధానాల ద్వారా సహజమైన జుట్టు శాశ్వతంగా పెరగడానికి సంబంధించిన వైద్య నిపుణులను సంప్రదించండి.
హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు healthpage యాజమాన్యం బాధ్యత వహించదు. ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.
Comments
Post a Comment