గుండెపోటుకు, పక్షవాతం రావడానికి కారణాలు దాదాపు ఒకే రకం!...

గుండెపోటుకు, పక్షవాతం రావడానికి కారణాలు దాదాపు ఒకే రకం!...

 మన శరీరం మొత్తానికి రక్తాన్ని అందించే గుండెకు (గుండె కండరాలకు ).రక్తం అందకపోతే వచ్చేది హార్ట్ ఎటాక్. 

మన జీవితాన్ని అనుక్షణం నడిపించే మెదడుకు రక్తం అందకపోతే వచ్చేది బ్రెయిన్ ఎటాక్(పక్షవాతం). 

 గుండెపోటుకు, పక్షవాతం రావడానికి కారణాలు దాదాపు ఒకే రకం. 

  •  అధిక రక్తపోటు ( బిపి)
  • పొగ త్రాగటం 
  • షుగర్ వ్యాధి ఉండటం
  • కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం. 
  • కొవ్వు రక్తంలో అధికంగా చేరడం.
  • వయస్సు (ఎక్కువ వయస్సు గల వారికి) 
  • కుటుంబ చరిత్ర ( కుటుంబాల సభ్యులకు పక్షవాతం నుండి వారసత్వంగా రావచ్చు). 

ఇప్పటి వరకు పక్షవాతం రానివారు అసలు రాకుండా చూసుకోవడానికి తీసుకుని ముందు జాగ్రత్తలు ప్రైమరీ ప్రివెన్షన్స్ అంటారు. పక్షవాతం వచ్చిన వారిలో 70 శాతం మంది మొదటిసారి స్ట్రోక్ వచ్చిన వారే ఉంటారు. మిగతా 30% మంది స్ట్రోక్ మళ్లీ తిరగబడిన వారు ఉంటారు.  అందుకే  నివారణలోను ప్రైమరీ ప్రివెన్షన్స్ మరీ ముఖ్యం.

ఒకసారి పక్షవాతం తరువాత మళ్లీ మామూలుగా అయినవారు రెండోసారి అది మరో మారు తిరగబడకుండా  తీసుకునే  ముందు జాగ్రత్తలను  సెకండరీ ప్రివెన్షన్ గా పేర్కొంటారు.  

తొలి జాగ్రత్తలు: 

 బీపీ  సాధారణంగా 140/80 కంటే తక్కువగా ఉండాలి.  అయితే షుగర్ తో పాటు మిగతా రిస్క్ ఫ్యాక్టరీ ఉన్నవారు బిపిని 130/80 లోపే ఉండేలా చూసుకోవాలి.  లేని వాళ్ళు కూడా రెండోసారి బిపి చెక్ చేయించుకోవాలి . అయితే రిస్క్ ఫాక్టర్స్  ఉంటే మాత్రం మరింత తరచూ బీపీ చెక్ చేస్తూ ఉండాలి. 

కొలెస్ట్రాల్ నియంత్రణ:

రక్తంలో కొవ్వు(కొలెస్ట్రాల్) శాతం ఎక్కువగా ఉన్నవారు తరచూ రక్త  పరీక్ష చేయించుకుని, కొలెస్ట్రాల్ను మందల ద్వారా అదుపులో ఉంచుకోవాలి.

బరువు నియంత్రణ: 

స్థూలకాయం ఉన్నవారు అదనంగా బరువు ను తగ్గించుకోవడం.

వ్యాయామం: 

రోజుకు 30  నిమిషాలు చొప్పున ప్రతిరోజు లేదా రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో నాలుగైదు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

ఆహారం: 

స్థూలకాయం ఉన్నవారు అదనంగా ఉన్న బరువును తగ్గించుకోవడం.  అన్ని పోషకాలు సమపాలలో ఉంటేనే  సమతుల ఆహారం.  కొవ్వు తక్కువగా ఉండే  ఆహారం తీసుకోవాలి. ఆహార వ్యవహారాల్లో మార్పులు అవసరం.  వ్యాయామం చేయడం ముఖ్యం.  బరువు నియంత్రణ చూసుకోవాలి. పొగతాగడం మానేయడం మంచిది.  ఆల్కహాల్ తీసుకునే వారైతే పరిమితంగా తీసుకోవడం వంటి మార్పులను జీవనశైల్లో మార్పులు (లైఫ్ స్టైల్ మాడిఫికేషన్) గా డాక్టర్లు చెబుతుంటారు.  స్ట్రోక్   నివారణకు ఇవి ముఖ్యం.


సెకండరీ ప్రివెన్షన్:

పైన పేర్కొన్న ప్రధాన జాగ్రత్తలు తీసుకుంటేనే గుండె జబ్బులు ఉన్నవారు గుండె గదుల్లో రక్తం గడ్డ గడ్డ కట్టి ఉన్నను, పంపింగ్ శాతం తగ్గినా, గుండె కావటాల్లో సమస్యలు ఉన్నవారి ఉన్నదానికి అనుగుణంగా వైద్య పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు సెకండరీ ప్రివెన్షన్స్ చెప్పవచ్చు. 

మెడలోని రక్తనాళాలు సన్నబడితే... 

 మెదడుకు రక్తాన్ని చేరవేసి రక్తనాళాలను 'కెరోటిక్ ఆర్తరీస్'  అంటారు . అవి సన్నబడటాన్ని  సర్జరీ స్టేనోసిస్ అంటారు. 

 ఒకసారి పక్షవాతం వచ్చిన వారిలో మెడలోని రక్తనాళాలు 50% కంటే ఎక్కువగా సన్నబడితే ఎం డార్క్ ట్రెక్టమి అనే శస్త్ర చికిత్స గాని, కెరోటిక్ స్టెంటింగ్ రాని  వారికరి ఒకవేళ ఆ రక్తనాళాలు సన్నబారడం అనే సమస్య 60 శాతానికి పైగా ఉన్నప్పుడు వైద్యనిపుణుల సలహా మేరకు అవసరమైన కరెక్షన్ చేయించుకోవాలి.

 లక్షణాలు:  

  •  ఉన్నట్టుండి శరీరంలో ఒకవైపు సగభాగం బలహీనంగా లేదా బండ బారినట్లు అనిపించడం. 
  • మాట్లాడడానికి గాని అర్థం చేసుకోవటానికి గాని ఉన్నట్లుండి ఇబ్బంది కలగడం 
  • ఉన్నట్లుండి నడవడం కష్టంగా మారటం, కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడం, బ్యాలెన్స్ కోల్పోవడం. 
  • వికారంగా తీవ్రస్థాయి తలనొప్పి రావడం.


హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు  healthpage యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.


Comments