స్థూల కాయం అనేక అనారోగ్య కారకాలకు మూలం. బిపి షుగర్ గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు క్యాన్సర్ మలబద్ధకం అజీర్తి ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు అనేకం. ప్రపంచమంతా దీని బారిన పడి సతమతమవుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడంతో స్థూలకాయం ఏర్పడుతుంది. ప్రధానంగా అధిక పొట్ట ఏర్పడడంతో మనకు మనమే ఇబ్బందిగా మారుతాము. స్థూలకాయంతో బాధపడుతున్న వారినె కాదు సాధారణ బరువు ఉన్నవారిని సైతం అధిక పొట్ట ఇబ్బందులకు గురిచేస్తుంది. శరీరంలో ఏ భాగం సంగతి పక్కన పెట్టిన ప్రధానంగా అధికంగా ఉన్న పొట్టను తగ్గించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ క్రింద ఇచ్చిన కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా అధిక పొట్టను తగ్గించుకోవచ్చు.
- నిమ్మకాయలో కొవ్వును కరిగించే గుణాలు నిమ్మరసంలో పుష్కలంగా ఉన్నాయి. ఉదయం నిద్ర లేచి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పిండి ఆ రసాన్ని తాగాలి. దీంతో కొద్ది రోజుల్లోనే అధికంగా ఉన్న పొట్ట తగ్గిపోతుంది. అయితే మీరు కూడా ఇలా కూడా చేసి తాగవచ్చు ఎలా అంటే ఒక నిమ్మకాయను పిండి అందులో ఒక రెండు టీ స్పూన్ల తేనెను కూడా కలుపుకొని తాగితే కొద్ది రోజుల్లోనే మీకు ఫలితం కనబడుతుంది.
- మనం రాత్రి పడుకునే ముందు ఒక రాగి చెంబు నిండా నీటిని నింపి అందులో ఒక జామాకు వేసి ఉంచాలి. ఉదయం లేచి ఆ నీటిని తాగితే శరీరానికి మంచి తేజస్సు కడుపులో ఉన్న మలినాలను పారద్రోలడమే కాకుండా పొట్ట తగ్గడానికి తోడ్పడుతుంది. ప్రతిరోజు కొన్ని బాదం పప్పులను తింటే ఫలితం ఉంటుంది. బాదంపప్పులో ఒమేగా 3 ప్యాటి యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో ఉపకరిస్తాయి.
- మనకు కడుపు నిండినట్లుగా అనిపించాలంటే భోజనానికి ఒక గంట ముందు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి బాగా కలిపి తాగాలి. దీంతో ఆకలి బాగా తగ్గుతుంది. ఈ క్రమంలో ఆహారం తక్కువగా తింటారు. అంతేకాదు కొవ్వును కరిగించే గుణాలు ఆపిల్ సైడర్ వెనిగల్లో ఉండడంతో బరువు కూడా తగ్గుతారు.
- ఉదయం నిద్ర లేవగానే పుదీనా ఆకులను తీసుకుని, వాటిని బాగా నలిపీ రసం తీయాలి. ఈ రసాన్ని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగాలి. దీంతో పొట్ట దగ్గర అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఇలా చేయడం వల్ల మనలోని రోగనిరొదక శక్తి కూడా పెరుగుతుంది. మలబద్ధకం పోతుంది.
- ఉదయం సాయంత్రం భోజనానికి అరగంట ముందు అలోవెరా జ్యూస్ ను 30 ఎంఎల్ మోతాదులో తీసుకొని, ఒక గ్లాసు నీటిలో బాగా కలిపి తాగాలి. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం అవుతుంది. పొట్ట తగ్గేది కొవ్వకారిగిపోతుంది. శరీరంలోకి అదనంగా కొవ్వు ప్రవేశించదు.
- భారత్, చైనా లో అల్లం తో గత ఐదువేల ఏళ్లుగా విడదీయరాని బంధం ఉంది. అల్లంతో శక్తివంతమైన ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. భారత దేశంలో పండించే అల్లంలో శక్తివంతమైన ఔషధ విలువలు ఉన్నాయని, అనేక శతాబ్దాలుగా చాలా రుగ్మతలకు సహజ ఔషధంగా వినియోగిస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యల విషయంలో అల్లంను వైద్య గుణాలను వస్తువుగా ఉపయోగిస్తున్నారు. ఇది కొవ్వును కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంత అల్లం రసం కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- బీన్స్ ను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటున్న ఫలితం ఉంటుంది. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. జీర్ణ క్రియ మెరుగుపరుస్తాయి. చాలాసేపు ఉన్న కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఆహారం తినడం తక్కువ బరువు తగ్గుతారు.
- కీరదోసకాయ ద్రావణాన్ని ఒక గ్లాసు మోతాదులో భోజనానికి అరగంట ముందు ఉదయం సాయంత్రం వేళల్లో తాగితే కొవ్వు కరిగిపోతుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగించే ఎక్కువ ఆహారం తినకుండా చేస్తుంది.
- ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో టమాటలది కీలకపాత్ర క్యాన్సర్ కణాలను నిరోధించడంలో టమాటలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఈమధ్య జరిగిన పరిశోదనలో తేలింది. ప్రతి రోజు ఉదయం పరిగడుపున బాగా పండిన ఒక లేదా రెండు టమాటాలను తినాలి. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరిగిపోతుంది. టమాటల్లో ఉండే తొమ్మిది ఆక్సో ఓడిఏ అనే పదార్థాలు రక్తంలో ఉన్న కొవ్వును తొలగిస్తుంది.
హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు healthpage యాజమాన్యం బాధ్యత వహించదు. ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.
Comments
Post a Comment