చిన్నారి ప్రాణం కాపాడుకోవాలంటే ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు..

చిన్నారి ప్రాణం కాపాడుకోవాలంటే ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు..

 

చిన్నారి ప్రాణం కాపాడుకోవాలంటే ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు 

--సాయం చేయండి అని దాతలను కోరుతున్న చిన్నారి తల్లిదండ్రులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన కొలను దిలీప్ రెడ్డి - యామిని దంపతుల కుమారుడైన  6 నెలల వయసు కలిగిన భవిక్ రెడ్డి అనే చిన్నారి  అత్యంత ప్రమాదకరమైన స్పైనల్ మస్కలర్ ఆటోఫ్రీ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రస్తుతం చికిత్స అందిస్తున్న  హైదరాబాద్ లోని రెయిన్బో హాస్పిటల్ వైద్యులు  భవిక్ రెడ్డి నరాల కండరాల బలహీనత తో ఎస్ఎమ్ఏ టైప్ -1 హైరిస్క్ తో ఉన్నారని, ఈ వ్యాధి లక్షల్లో ఒకరికి వచ్చే ఈ ప్రాణాంతక వ్యాధి ని నయం చేసే ఇంజక్షన్ ఇవ్వకపోతే చనిపోతాడని వైద్యులు తెలుపడంతో భవిక్ రెడ్డి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఇంజక్షన్ అమెరికాలో దొరుకుతుందని  ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు అని తెలిపారు.   భవిక్ రెడ్డి ప్రస్తుతం న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి పర్యవేక్షణలో వైద్యం జరుగుతుంది.  ఇప్పటికే రెయిన్బో ఆసుపత్రి యాజమాన్యం గొప్ప సేవ భావంతో విదేశాల  దాతల నుండి రూ. 10 కోట్లు సేకరించారు. మిగతా డబ్బులు మన ఇండియా నుండి సేకరించుకోవాలి తెలుపడంతో తమ చిన్నారి  భవిక్ రెడ్డి ప్రాణాలు కాపాడుకోడానికి  తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాల  నుండి మరియు దాతల నుండి  విరాళ సహకారం  కోరుతున్నట్లు  healthpage వెబ్సైటు యాజమాన్యానికి ఫోన్ లో వివరించారు. భవిక్ రెడ్డి అనే చిన్నారి ప్రాణం కాపాడటానికి విరాళం చేయవలసిన దాతలు సంప్రదించవల్సిన బ్యాంకు అకౌంట్ వివరాలు:బ్యాంకు అకౌంట్ హోల్డర్ పేరు: కొలను దిలీప్ రెడ్డి, అకౌంట్ నెంబర్: 42380569990, ఐఎఫ్ఎస్ సి కోడ్ : ఎస్ బీ ఐ ఎన్ 0021766, ఫోన్ పే/ గూగుల్ పే నెంబర్: 9640160506

హెల్త్ పేజ్ పాఠకులకు ముఖ్య గమనిక: హెల్త్ పేజ్ వెబ్సైట్ లో ప్రచురించే సందేశాలు సంబంధిత వైద్య నిపుణల ద్వారా ప్రచురించబడుతున్నాయి. మీరు స్వతహాగా పాటించకుండా మీ సమస్యల పరిష్కారం కోసం వైద్య నిపుణులను సంప్రదించగలరు. హెల్త్ పేజ్ వెబ్సైటు లో ప్రచురించే సందేశాలు & ప్రకటనల పట్ల పూర్తి పరిశీలన చేసి వైద్య నిపుణల సలహాల మేరకు నిర్ణయం తీసుకోగలరని మనవి. ఎటువంటి కొనుగోళ్లు లేదా ఇతరత్రా లావాదేవీలకు గాని తరువాత జరిగే పరిణామాలకు  healthpage యాజమాన్యం బాధ్యత వహించదు.  ఇక్కడ అందించిన కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్ వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు.

Comments